Monday, December 23, 2024

ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ రాజర్షి షా

మెదక్: దశాబ్ది ఉత్సవాలు దగ్గర పడుతున్నందున ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేసి నాలుగైదు రోజులలో ప్రక్రియ ముగిసేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం అధికారులకు సూచించారు. రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ధాన్యం తరలించుటకు అనుమతి వచ్చినందున స్థలాభావ సమస్య కొంతవరకు తీరిందని, కాబట్టి మిల్లుల వద్ద ధాన్యం త్వరగా దించుకునేలా మానిటరింగ్ చేయాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో కూడా లారీల కోసం వేచి చూడకుండా ధాన్యం తూకం వేసి సిద్ధ్దంగా ఉంచుకోవాలని అన్నారు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం జిల్లాలో 3 లక్షల 52 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందని, కాగా ఇప్పటివరకు 45,579 మంది రైతుల నుంచి 405 కోట్ల 70 లక్షల 97వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 13,460 మంది రైతులకు 108 కోట్ల 45 లక్షలు వారీ ఖాతాలో జమాచేశామని అన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 80 శాతం మేర టాబ్ ఎంట్రీ పూర్తయిందని, మిగతా రైతులకు కూడా డబ్బులు త్వరలో వారి ఖాతాలో జమా చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News