Thursday, January 23, 2025

ధాన్యం సేకరణపై చిల్లర రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కరీంనగర్ రూరల్: ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కించపరచాలని చూస్తే ఉపేక్షించబోమని, తెలంగాణలో ఇప్పుడిప్పుడే కొనుగోళ్ళు ప్రా రంభమయ్యాయని, ఈనెల చివరి నాటికి జోరందుకుంటాయని బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రిగంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, కమాన్‌పూర్, ఎలగందల్, ఆసిఫ్ నగర్, కాజీపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను శనివారం బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వరి ధాన్యం కొ నుగోళ్లును ప్రారంభించి ఆనంతరం ఆయన సమావేశంలో మాట్లాడుతూ రైతులు నిబంధన మేరకే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ప్రభుత్వాన్ని కించపరచాలని చూస్తే ఉపేక్షించబోమని, ఇప్పుడిప్పుడే కొనుగోళ్ళు ప్రారంభమయ్యాయని, ఈనెల చివరి నాటికి జోరందుకుంటాయన్నారు. నిన్న 47 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే, ఈరోజు 77 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని ఒక్కరోజులో 30 వేల మెట్రిక్ టన్నుల ధా న్యం పెరగడం ఇది రికార్డే అని అన్నారు.

తెలంగా ణ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1800 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని,మొన్నటికి ని న్నటికి కొత్తగా 250 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని,అవసరం ఉన్న చోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారుల కు సూచనలు జారీ చేశామని, ఇప్పటివరకు 10, 000 మంది రైతుల వద్ద 6,100 మెట్రిక్ టన్ను ల ధాన్యాన్ని సేకరించామని,ధాన్యం కొనుగోళ్ళలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేసే అవకాశం లేదని, ధాన్యం కొనుగోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అ న్ని చర్యలు తీసుకుందని,గన్ని బ్యాగులు నిధులకు కొరత లేదని, ప్రతిపక్ష పార్టీలు కల్లాల వద్ద రాజకీయాలు మానుకోవాలని,గతంలో సాగునీరు… కరెంటు రాక… ఎరువులు సకాలంలో దొరకక… పంట పెట్టుబడి లేక వ్యవసాయం కుంటుబడిందన్నారు.జిల్లాలో నాలుగు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామని,మొత్తం 352 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

ఇందులోభాగంగా ఇప్పటివరకు 110 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశామని, జిల్లాలో నేటి వరకు ఒక కోటి 70 లక్షల విలువచేసి 8303 టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ఒకేరోజు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిన కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వ్యవసాయం పై తెలంగాణ ప్రభుత్వం రైతులకు భరోసానిచ్చిందన్నారు. రైతు లు ఎవరికీ దరఖాస్తు ఇచ్చి దండం పెట్టాల్సిన అవసరం లేకుం డా రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బు లు జమవుతున్నామన్నాయని,తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రా ల్లో అమలు చేయ డం లేదన్నారు.తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News