Sunday, April 13, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ రైతు సేవ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని దత్తప్ప గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘ అధ్యక్షులు పేలపూడి వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యమును కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని తెలిపారు. ప్రైవేట్ దళారులను నమ్మి మోసపోవదని, సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వబడుతుందని వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు కంచర్ల యాదగిరి రెడ్డి, వల్లపు ఎంకన్న, వల్లపు సత్తయ్య, అంజిరెడ్డి, ఎలుగు గంగమల్లు, సంఘ కార్యదర్శి వరలక్ష్మి, సిబ్బంది, పి నరహరి, ఎస్ కె యాకూబ్, ఎస్ సందీప్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News