Monday, December 2, 2024

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు ప్రకటించి బీసీలకు సముచిత స్థానం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్, వట్టే జన్నయ్య యాదవ్, తిరుమణి నాగరాజ్ గౌడ్, కలివేముల మధు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీ కుల గణనకు ప్రభుత్వం సహకరించినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News