Monday, January 20, 2025

గ్రామ పంచాయతీ వర్కర్స్ సమ్మెకు తరలిరండి

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : జులై 6న గ్రామ పంచాయతీ వర్కర్స్ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు గ్రామపంచాయతీ కార్మికులకు పిలుపునిచ్చారు. దమ్మపేట మండలం 31 గ్రామపంచాయతీ వర్కర్స్ సమావేశం దమ్మపేటలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయితీ కార్మికలకు నెలకు 24 వేల రూపాయలు ఇవ్వాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, న్యాయమైన హక్కులను సాధించాలని సమ్మె తప్ప వేరే మార్గం లేదని ఆరో తారీకు నుంచి తలపెట్టిన సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని పేర్కొన్నారు.

న్యాయమైన హక్కులను సాధించుకొనుటకు అవసరమైతే జైలుకి ప్రాణం త్యాగానికైనా సిద్ధపడాలని అనేక ఒడిదుడుకులను తట్టుకొని మన హక్కులను సాధించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తంగెళ్ల ముడి శివకృష్ణ. ప్రభాకర్, వెంకటేశ్వరరావు, రాంబాబు, బసవయ్య, రామకృష,్ణ మోహనరావు, అన్నవరం రాములు, ఆకుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News