Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్ పాలనలోనే గ్రామ స్వరాజ్యం

- Advertisement -
- Advertisement -
  • మహాత్ముడి కలలు సాకరం చేస్తున్నాం
  • తెలంగాణలోని ప్రతి సంక్షేమ పథకం దేశానికి ఆదర్శం
  • అభివృద్ధిలో ముందుంది ‘కోహెడ మండలం’
  • రూ. 2 కోట్ల 66 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

కోహెడ: సిఎం కెసిఆర్ పాలనలోనే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మ ండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ సోమవారం పాల్గొన్నారు. ఆరెపల్లి, నాగసముద్రాల, బత్తులవాని పల్లి, పరివేద, వరికోలు గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి రూ. 20లక్షలు నిధులతో నిర్మించే నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం పనులకు ఎ మ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. నాగసముద్రాల, తీగలకుంటపల్లి గ్రా మపరిధిలోని సోమరంపల్లి, పరివేద, వరికోలు గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి రూ. 10 లక్షల నిధులతో నిర్మించే సిసి రోడ్డు నిర్మాణాల కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గోని పనులను ప్రారంభించారు.

మైసంపల్లి గ్రామంలో రూ.12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠదామం, రూ. 16లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనం, రూ. 12 లక్షల తో నిర్మించిన మహిళా సమైఖ్య భవనాలను ఎమ్మెల్యే సతీష్ ప్రారంభించారు. అలాగే వింజపల్లి గ్రామంలో రూ. 73 లక్షల నిధులతో నిర్మించి న గ్రామపంచాయతీ భవనం, మహిళా సమైఖ్య భవనం, ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. నాగసముద్రాల, గొ ట్లమిట్ట గ్రామాల్లో ఐమాస్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది. గొట్లమిట్ట గ్రామంలో వరసిధ్దిలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సతీష్ పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే వొడితల మాట్లాడుతూ…. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన పల్లెలను నేడు సిఎం కెసిఆర్ ప్రత్యేకమైన అభివృద్ధి ప్రణాళికలతో దేశానికే ఆదర్శంగా నిలిచేటట్టు కృషిచేశారని తెలిపారు. గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం కెసిఆర్ పాలనలో సాధ్యమైందని చెప్పారు. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత నిచ్చిందని వెల్లడించారు.

తెలంగాణ పల్లెలు అభివృద్ధి కుసుమాలుగా వికసిస్తున్నాయని స్ఫష్టం చేశారు. గ్రామాలాభివృద్ధి కోసం నెల నెల ప్రభుత్వం నిధులు పంచాయతీలకు విడుదల చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందిస్తున్నట్లు వివరించారు. బంగారు తెలంగాణే లక్షంగా తెలంగాణ పల్లెలు కేసిఆర్ సారథ్యంలో అభివృద్ధిలో దూసుకపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్, జడ్పిటిసి నాగరాజు శ్యామల మధుసూదన్‌రావు, ఫ్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్‌రావు, బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, వైస్ ఎంపిపి తడకల రాజిరెడ్డి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు జాగిరి కుమారస్వామి గౌడ్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, యువత మండల అద్యక్షుడు జాలిగం శంకర్, నాయకులు తిప్పారపు శ్రీకాంత్, పొన్నాల లక్ష్మయ్య, అబ్దుల్ రహీం, పెరుగు నరేందర్ రెడ్డి, బత్తిని తిరుపతి గౌడ్, సంబంధిత గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News