మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో రైతులకు మరింత అవగాహన పెంపోందించేందుకు ఈ నెల 21న రైతు భారతి అధ్వర్యంలో కిసాన్ ఎక్స్‌పో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ ఎల్లారెడ్డి తెలిపారు. హైటెక్స్ వేదికగా శనివారం ఉదయం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రారంబోత్సవం చేస్తారని తెలిపారు.
తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలనుంచి వ్యవసాయం వాటి అనుబంధ రంగాలకు చెందిన నిపుణులు, యంత్ర పరికరాల ఉత్పత్తి దారులు, విత్తన కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఉత్పత్తలను ప్రదర్శనకు ఉంచుతారన్నారు. సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు కూడ చేస్తున్నామన్నారు. శని, ఆదివారాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో కామధేను జాతీయ మిషన్ అధ్యక్షుడు వల్లభాయ్ కతిరియా, వి.భాగయ్య, పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి, ఆర్టీసి ఎండి వి.సి సజ్జనార్ ,చిరుధాన్యాల శాస్త్రవేత్త డా.ఖాదర్ వలి, ఉద్యాన శాఖ డైరెక్టర్ యల్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొంటారని ఎల్లారెడ్డి పేర్కొన్నారు.