Sunday, December 22, 2024

గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేత?!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ మున్సిపల్ డెవలప్ మెంట్ అథారిటీ(HMDA) పరిధిలోని గ్రామపంచాయతీ(GP) లేఅవుట్లలో వెలిసిన వెంచర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూర్ఖపు చర్య అని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజల గురించి పట్టించుకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పిచ్చి చర్య అని మండిపడ్డారు. సిఎం రేవంత్ తీసుకుంటున్న నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం పేద, మధ్యతరగతిని లక్ష్యం చేసుకుంటోందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వం ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను పరిష్కరించడం పోయి, కొత్త సమస్యలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావంటే ఏం కావాలి?.. అని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News