Thursday, January 23, 2025

అమ్మమ్మను మర్డర్ చేసిన మంచూరియా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మనవడు అమ్మమ్మ తినడానికి గోబి మంచూరియా తీసుకొచ్చి ఇచ్చాడు. ఆమె మంచూరియా ప్యాకెట్ ను విసిరి కొట్టడంతో మనవడు కోపంతో అమ్మమ్మపై కర్రతో దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే వృద్ధురాలు చనిపోయిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు నగరం కెంగేరిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శాంతకుమారి(69) తన కూతురు శశికళ(46), మనవడు సంజయ్ (26)తో కలిసి జీవనం సాగిస్తోంది. ఇంటర్‌లో అతడికి 90 శాతం మార్కులు రావడంతో సంజయ్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్‌లో చేరాడు. 2016 అగస్టులో అమ్మమ్మ కోసం అతడు గోబి మంచూరియా తీసుకవచ్చాడు. మంచూరియా పొట్లాన్ని ఆమె విసిరికొట్టడంతో అతడికి కోపం వచ్చింది. వెంటనే కర్ర తీసుకొని ఆమె తలపై బాదాడు.

ఒక దెబ్బతో ఆమె మృతి చెందడంతో తల్లి, కుమారుడికి ఏం చేయాలో తోచలేదు. వెంటనే శవాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదం అని భావించారు. సందీప్ అనే స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు. ముగ్గురు గోడకు రంధ్రం చేసి శవాన్ని అందులో కుక్కారు. అనంతరం గొడకు ప్లాసర్ వేశారు. ఇంటి యాజమానికి ఫోన్ చేసి తాము సొంతూరు వెళ్తున్నామని చెప్పి వెళ్లారు. వారు తిరిగి రాకపోవడంతో యాజమాని 2017 మే నెలలో బలవంతంగా డోర్లు ఓపెన్ చేసి చూడగా ఓ గోడపైన రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇంట్లో ఉన్న మొబైల్ కాల్ హిస్టరీని పరిశీలించారు. సందీప్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మృతదేహాన్ని గొడలో పెట్టామని తెలిపాడు. గొడను తవ్వి చూడగా అస్థికలు బయటపడ్డాయి. పారిపోయిన శశికళ, సంజయ్ మహారాష్ట్రలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామని కెంగేరి పోలీస్ స్టేషన్ అధికారి వసంత్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News