గులాబీమయమవుతున్న ప్రధాన కూడళ్లు, శరవేరంగా జరుగుతున్న సభా వేదిక ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీ ఈ నెల 25వ తేదీన తలపెట్టిన ప్లీనరీ సమావేశానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. నగరంలోని హెచ్‌ఐసిసి వేది కగా జరగనున్న ఈ సమావేశానికి సుమారు 6500 మం ది పార్టీ ఆహ్వానితులు హాజరవుతున్నారు. దీంతో సభకు హాజరయ్యే ప్రతినిధులకు అవసరమైన ఏర్పాట్లు భారీ స్థా యిలో జరుగుతున్నాయి. సభావేదిక జరిగే పరిసర ప్రాం తాలతో పాటు నగరంలోని అన్ని కూడళ్లన్నీ గులాబీ మ యం అయ్యే విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు లో భాగంగా నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద సిఎం కెసి ఆర్, పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కెటిఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ ఐలాండ్‌లకు పార్టీ జెండాలతో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నగరం నాలుగువైపులా పెద్దఎత్తున స్వాగత వేది కలను అత్యంత భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చకాచకా సాగుతున్నా యి. ఇక సభా ప్రాంగంణంలో టిఆర్‌ఎస్ పార్టీ ఆవి ర్భావానికి దారి తీసిన పరిస్థితులతో పాటు ఉద్యమ కా లం ప్రధాన ఘటనలకు సంబంధించి ఒక ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం శాసనసభ్యుడు మాగం టి గోపినాథ్ ఆధ్వర్యంలో సిఎం క్యాంప్ కార్యాలయం నుంచి కెసిఆర్ సభా వేదికకు చేరుకున్న మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ప్లీనరీ కోసం ఏర్పా టు చేసిన సభా వేదిక బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి ప్ర ధానంగా ఖ్యాతి లభించిన కాళేశ్వరం, నగరంలోని మొ దటిసారిగా ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జితో పాటు అ మరవీరుల స్తూపం ఆకారాలతో కూడిన వేదికను ఏర్పా టు చేస్తున్నారు. ఇక ఆహ్వానితులకు కూడా రకరకాల పిండివంటలతో పాటు వివిధ రకాల నాన్‌వెజ్ వంటకా లను కూడా సిద్ధం చేస్తున్నారు. అలాగే శాకాహారులకు కూడా పసందైన వంటలను వడ్డించేందుకు భారీ ఏర్పా ట్లు జరుగుతున్నాయి. ఈ పనులు కూకట్‌పల్లి నియోజ కవర్గం శాసనసభ్యుడు మాదవరం కృష్ణారావు నేతృత్వం లో భోజనశాలకు చెందిన పనులు జోరుగా సాగుతున్నా యి. కాగా గురువారం ప్లీనరీ ఏర్పాట్ల పనులను టిఎస్ ఐఐసి చైర్మన్ బాలమల్లు, ఎంఎల్‌ఎ మాగంటి గోపినాథ్, బిసి కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్‌తో పాటు పలు వురు టిఆర్‌ఎస్ నాయకులు పరిశీలించారు.