Wednesday, January 22, 2025

డిజిపి కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

- Advertisement -
- Advertisement -

Grand Bathukamma celebrations at DGP office

వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్: నిరంతరం శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమయ్యే పోలీస్ అధికారులు తమ రోజువారీ విధులకు భిన్నంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. డీజీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డీజీపీ మహేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై బతుకమ్మ వేడుకలను పూర్తిగా వీక్షించారు. సీఐడీ డిజిపి గోవింద్ సింగ్, అడిషనల్ డీజీ లు శివధర్ రెడ్డి, విజయకుమార్, ఉమేష్ ష్రాఫ్, ఐజి లు నాగిరెడ్డి, కమల్ హాసన్ రెడ్డి, ఎస్.ఫై లు సృజన తదితరులు హాజరయ్యారు. డీజీపీ కార్యాలయ టి.ఎన్.జి.ఓ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో మహిళా పోలీసు అధికారులు, కార్యాలయ మహిళా సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా బతుకమ్మ పాటలు, దాండియా ఆటలతో పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహించడంతోపాటు అత్యధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా ఉద్యోగులకు,అధికారులకు,ఉద్యోగ సంఘాల బాధ్యులకు ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ బతుకమ్మ వేడుకలలో డీజీపీ కార్యాలయంలోని వివిధ విభాగాల కు చెందిన అధికారులు, సిబ్బంది వేర్వేరుగా బతుకమ్మలతో కార్యాలయ ఆవరణలోకి ఊరేగింపుగా వచ్చి పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలు ప్రారంభమయినప్పటినుండి ముగిసేంత వరకు డిజిపి మహేందర్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ పోలీస్ అధికారులు వేదిక వద్దనే ఉండి వీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News