Thursday, January 23, 2025

టి టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధర్వంలో బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ మేరకు శనివారం ఎన్‌టిఆర్ భవన్‌లో టి టిడిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి ఆధ్వర్యంలో ఆట పాటలతో తెలుగు మహిళలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనారు.

బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలు తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సమిష్టి చైతన్యానికి ప్రతీక అని అన్నారు. నవ చైతన్యంతో జీవనాన్ని అనుగ్రహించే ప్రాణ శక్తి ఈ బతుకమ్మ అని, పుష్పాలతో దైవాన్ని ఆరాధించడం మామూలు విషయం కాదన్నారు. ఇలా పూల అమరికనే దైవ స్వరూపంగా భావించి పూజించడమే ఈ బతుకమ్మ విశిష్టత అని భవనం షకీలా రెడ్డి పేర్కొన్నారు. సమస్థ ప్రకృతికి సూచికగా పూలదొంతరలను పేర్చి నవరాత్రుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మను ఆట, పాటలతో ఆరాధిస్తామన్నారు. అక్రమ కేసుల నుంచి చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటికి రావాలని అమ్మవారిని ఈ సందర్భంగా పూజించినట్లు షకీలా రెడ్డి తెలిపారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి ఆత్మ స్థైర్యాన్ని కలిగించాలని, వారి కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, మీడియా కో ఆర్డినేటర్ బియ్యని సురేష్ , మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News