Monday, December 23, 2024

వైభవంగా క్రిస్మస్ వేడుకలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా చర్చిలలో ప్రార్థనలు
చర్చిల వద్ద ఇబ్బందులు రాకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మిస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏసుక్రీస్తు ప్రార్ధనలతో చర్చిలు కళకళలాడాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి క్రైస్తవులు చర్చిలకు పొటెత్తడంతో ఏసు నామస్మరణతో చర్చిలు మారుమోగాయి. వేలాది మంది ఏసయ్య దీవెనెల కోసం బారులు తీరారు. సోమవారం ఉదయం 10గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులతో చర్చిలు సందడిగా కనిపించాయి. స్దానిక ఎ మ్మెల్యేలు, ఎంపిలు పాల్గొన్ని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసు దీవెనలు రాష్ట్ర ప్రజలందరికి ఉండాలని కోరారు. ప్రభుత్వం చర్చిల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. నగరంలోని సికింద్రాబాద్‌లోని వెస్లీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే పద్మారావు పాల్గొన్నారు. బిషప్ వారికి ఆశీర్వచనం చేశారు. అదే విధంగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాంతినగర్ చర్చి లో నిర్వహించిన ప్రార్ధనలో పాల్గొన్ని శాంతి,కరుణమయుడు ఏసుప్రభు, ఆయన మార్గంలో నడవాలని సూ చించారు. ఖమ్మంలో తుమ్మల, పొంగులేటి పలు చర్చిల్లో ప్రార్దనలు చేసి ఏసు శాంతి దూత ఆయన చూపిన దారి లో వెళ్లాలని క్రైస్తవ సోదరులకు సూచించారు.

కరీంనగర్‌లో మంత్రి పొన్నంప్రభాకర్,మహబూబ్‌నగర్‌లో జూపల్లి, వరంగల్ పట్టణంలో కొండా సురేఖ, సీతక్క క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.ఎంతో ప్రసిద్ది చెందిన మెదక్ సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

తెల్లవారుజామున నిర్వహించిన తొలి ఆరాధన ప్రార్థనల్లో పాల్గొన్న మెదక్ సీఎస్‌ఐ చర్చి ఇన్‌చార్జి బిషప్ పద్మారావు దైవ సందేశం చేశారు. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును భూమిపైకి పంపించిన రోజే క్రిస్మస్ అని, క్రీస్తును ఆరాధించడమే క్రిస్మ స్ పండుగ అని చెప్పారు. ఆకాశంలో తోకచుక్క ఉద్భవించగానే ఈ విశ్వానికి వెలుగులా మన జీవితాలు మార్చడానికి వచ్చిన దేవుడే ఏసుప్రభు అని తెలిపారు. ప్రభువైన ఏసు ఈలోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన ఆచార్యకర్త, ఆలోచన కర్త గల దేవుడు అని, ఈ సమాజానికి అధిపతి అని చెప్పారు. లోకంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలన్నదే ప్రభువు అభిమతమన్నారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి శాంతి, ప్రేమతత్వాన్ని అలవర్చుకొని నడుచుకోవాలని సూచించారు. ప్రభువుకు మరణం లేదని, ఆయన మాటల్లో జీవముందని చెప్పారు. సమాజ రక్షకుడిగా ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని తెలిపారు. ప్రభువు చూపి న మార్గాలను అనుసరించడం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రేమ, శాంతి, ఐక్యతే క్రిస్మస్ సందేశమని చెప్పారు. ప్రజలకు, క్రైస్తవులకు, మహా దేవాలయానికి విచ్చేసిన భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ వేడుకల సందర్బంగా ఎమ్మెల్సీ కవిత నగరంలోని మెథడిస్టు చర్చిలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్ని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండాలని కోరినట్లు తెలిపారు.

Calvary temple

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News