Saturday, November 23, 2024

ఘనంగా పెద్దపూర్ మల్లన్న బోనాలు

- Advertisement -
- Advertisement -

మెట్‌పల్లి రూరల్: తెలంగాణలో అతిపెద్ద బోనాల జాతరగా పేరుపొందిన పెద్దపూర్ మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రంమైంది. ఆదివారం జగిత్యాల జిల్లా మెట్ పల్లీ మండలంలోని పెద్దపూర్ గ్రామాల్లో మల్లన్న బోనాల జాతర అంగరంగ వైభోగంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పొట్టేత్తిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయాయి.బోనాల ఉత్సవాన్ని కన్నులారా తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.కోరిన కోరికలు తీరుస్తూ అందరినీ ’సల్లంగ చూడు స్వామి ’అంటూ మొక్కులు చెల్లించుకున్నారు.

ఉపావాసలతో కుటుంబ సమేతంగా మల్లన్న స్వామినీ దర్శించుకొని పసుపు, గొర్రేపిల్లలను కానుకగా సమర్పించారు.భక్తులు ఆలయ ప్రాంగణంలో బెల్లం నైవేద్యం వండి మల్లన్నస్వామికి సుమారు లక్షకు పైగా బోనాలతో అంగరంగ వైభోగంగా డప్పుచప్పుల మధ్య ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు,శివశక్తుల పునాకలు,పోతరాజుల విన్యాసాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మల్లన్న స్వామికి బోనాలు సమర్పించారు.శివశక్తుల పునకాలను,పూనకం వచ్చిన ఆలయ పూజారి నీ తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.అనంతరం భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఆలయం చుట్టూ రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఎంపిపి మారు సాయిరెడ్డి నాయకులు కల్వకుంట్ల సంజయ్ తో కలిసి కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలను మల్లన్న స్వామికి సమర్పించి పూజలు నిర్వహించారు.ఎండ త్రీవత ఎక్కువగా ఉండటంతో భక్తులకు మంచినీటిని పంపిణీ చేసిన పలు ట్రస్ట్,సేవ సంఘలను ఆలయ కమిటీ వారు అభినందించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా పోలీస్ బలగాలతో చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News