Wednesday, January 22, 2025

లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఘనంగా గంగ తెప్పోత్సవం

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ ః లోయర్ ట్యాంక్‌బండ్ శ్రీకనకాల కట్టమైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గంగ తెప్పోత్సవం పూజలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కట్ట మైసమ్మ అమ్మవారికి పంచామృతాభిషేకము, ప్రత్యేకమైన రక్తాక్షి అలంకరణ చేశారు. అనంతరం పింగళి వెంకట్రామిరెడ్డి హాల్ నుంచి కట్టమైసమ్మ ఆలయం వరకూ ఘటోత్సవం ప్రదర్శన జరిపారు. అమ్మవారి దేవాలయంలో గంగ తెప్పకు పూజ జరిపి బలహరణలు చేసి ఊరేగింపుగా హుస్సేన్ సాగర్‌లోని గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ మండపంలో అమ్మవారి ఆవాహాన చేసి కళ్యాణము జరిపారు. పచ్చికుండపై స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణి విన్పించారు. పోతురాజుల విన్యాసంతో ఆలయం పరిసర ప్రాంతాలన్నీ మార్మోగాయి. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ సభ్యులు గోల్కొండ గౌతమ్‌కుమార్, ఈవో సాంబశివరావు, అర్చకులు సాత్విక్ శర్మతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News