Thursday, January 23, 2025

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

- Advertisement -
- Advertisement -
  • వేడుకల్లో ఎమ్మెల్యే రసమయి

బెజ్జంకి: గురుపౌర్ణమి సందర్భం గా మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిష న్ పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నిర్మల, జడ్పిటిసి కవిత, ఎఎంసి చైర్మన్ కచ్చు చంద్ర కళ, ఎస్‌ఐ ప్రవీణ్‌రాజ్, మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ పాకాల మహిపాల్ రెడ్డి, లక్ష్మణ్, ఎలుక దేవయ్య, సంతోష్, ఎలా శేఖర్ బాబు, భక్తులు పాల్గొన్నారు.

గజ్వేల్‌లో.. గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో సోమవారం అవదూత శ్రీ పాశం గోపాల్ రెడ్డి సమాది మందిరంలో భక్తులు శిష్యులు గురు పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా గణపతి పూజ, గురుపాదుకాపూజ, గురు షోడశ ఉపచార పూజలను ఘనంగా నిర్వహించారు. గజ్వేల్‌తో పాటు సిద్దిపేట, హై దరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చేల్, సంగారెడ్డి తదితర జిల్లాల నుండి ఆవదూత పాశం గోపాల్ రెడ్డి శిష్యులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేశ్, సభ్యులు వెంకటేశ్, రాజు, శ్రీనివాస్‌రెడ్డి, మందిరం చైర్మన్ పాశం మహేందర్‌రెడ్డి, సర్పంచ్ బాపిరెడ్డిలను కండువాలతో సత్కరించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. భక్తులు, శిష్యులు తదితరులు పాల్గొన్నారు.ఆయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప దేవాలయం కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీడిఆర్ స్కూల్ వ్యవస్థాపకులు నర్సింహారెడ్డి, తోట అమరేందర్‌రావు, డైరెక్టర్ కుర్రు సాయిరెడ్డి, చాడ విష్ణు వర్ధన్‌రెడ్డి, ప్రభాకర్, ప్రవీణ్, వినయ్, శివసాగర్, అఖిల్, పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

బెజ్జంకిలో… గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దా చారం ఎంపిటిసి కొలిపాక రాజు ఆద్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించి గురువులను సాదువులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిజెపి దలిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు దిటి రాజు, ఓబిసి మండల అధ్యక్షుడు బండిపల్లి సత్యనారాయణ, లక్ష్మణ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News