Wednesday, January 29, 2025

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు చేయాలి

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

జనగామ ప్రతినిధి : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు రోహిత్‌సింగ్, సుహాసిని, డీసీపీ పి.సీతారాం, సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రతిశాఖకు సంబంధించిన ప్రగతి వేదిక, ప్రసంగం కాపీని సిద్ధం చేయాలని, వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, రెవెన్యూ శాఖ, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ, మునిసిపల్, రెండు పడకల గది, చేనేత శాఖ, టూరిజం, దేవాదాయశాఖ, వైద్యారోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ తదితర (25) విభాగాలకు చెందిన స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు.

వేడుకలకు వచ్చే అతిథులు, ప్రజల సౌకర్యార్థం గ్రౌండ్‌లో కుర్చీలు, టెంట్లు, తాగునీరు తదితర వసతులు కల్పించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సభా ప్రాంగణంలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి విభాగానికి చెందిన అధికారులు వారికి కేటాయించిన పనలను తనిఖీ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా వేడుకలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం జిల్లా వ్యాప్తంగా లక్ష, 65 వేల జాతీయ జెండాలను అన్ని గ్రామపంచాయతీలకు, ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయజెండాకు ఎలాంటి ఇబ్బందులు, అవమానాలు రాకుండా ప్రజలకు చైనత్యం కల్పించి జెండాలను ఎగురవేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు రామ్మూర్తి, మురళీకృష్ణ, డీఆర్‌డీవో ప్రాజెక్టు డైరెక్టర్ రాంరెడ్డి, జెడ్పీ సీఈవో వసంత, ముఖ్య ప్రణాళిక అధికారి ఇస్మాయిల్, డీఏవో వినోద్‌కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పి.రవిందర్, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News