Monday, December 23, 2024

హజ్ హౌస్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం ఉదయం హజ్ హౌస్ ఆవరణలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీమ్ 77 వ భారత స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ మహమ్మద్ మసీవుల్లాఖాన్, డిసిపి సెంట్రల్ జోన్ ఎం. వెంకటేశ్వర్లు, వక్ఫ్‌బోర్డు ఇంచార్జి ఉగ్జిక్యూటివ్ అధికారి ఖాజా మొయినుద్దీన్, ఎసిపి(ఆబిడ్స్) ఆకుల చంద్రశేఖర్ ఇన్స్‌పెక్టర్ టి. నర్సింహ రాజు , తెలంగాణ హజ్ కమిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఇర్ఫాన్ షరీఫ్, హజ్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News