Wednesday, January 22, 2025

ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఘనంగా నిర్వహించింది. ఆ మేరకు సంఘం హైదరాబాద్ బడీచౌడీలోని తమ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశపౌరులకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ఉండాలని ఆనాడు మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లాంటి వారు ఆశించారని అన్నారు. అదే ఊపుతో బ్రిటీష్ పాలనకు విముక్తి కల్పించి స్వాతంత్య్రం తీసుకువచ్చారని దామోదర్ రెడ్డి గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్‌తో పాటు పలువురు పెన్షనర్లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News