Sunday, December 22, 2024

జలమండలిలో ఘనంగా కైట్ ఫెస్టివల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంక్రాంతి సంబరాల్లో భాగంగా జలమండలిలో కైట్ ఫెస్టివల్‌ను శుక్రవారం ఘనంగా ఉద్యోగులు నిర్వహించారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో టీఎన్జీవో జలమండలి విభాగం అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్లు రవికుమార్, ప్రవీణ్‌కుమార్, స్వామి హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు, వినియోగదారులక సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒకరు కుటుంబ సభ్యుల మధ్య సుఖ సంతోషాలతో పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం ఉద్యోగులతో కలిసి గాలి పటాలు ఎగురవేశారు. ఈకార్యక్రమంలో జలమండలి ఇంజనీరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్, హెచ్‌సీఏలో హెచ్‌ఎండబ్లూస్‌ఎస్బీ సెక్రటరీ రవీందర్‌రెడ్డి, ఉమెన్స్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుగంధిని, టీజీవో జలమండలి శాఖ నాయకురాలు చంద్రజ్యోతి, టీఎన్‌జీవో సంఘం జనరల్ సెక్రటరీ అజయ్‌సింగ్, నాయకులు సంతోష్, సాయికృష్ణ, భరత్, నవీన్, వాటర్‌వర్క్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు జయరాజ్, నారాయణ ,లక్ష్మినారాయణ, తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు సతీష్‌కుమార్‌లతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News