Monday, December 23, 2024

డిజిపి కార్యాలయంలో ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : డిజిపి కార్యాలయంలో మంగళవారం కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. డిజిపి రవి గుప్తా, అదనపు డిజిపిలు శిఖా గోయల్, అభిలాషా బిస్త్, మహేష్ ఎం. భగవత్, సంజయ్ కుమార్ జైన్, ఐజిలు ఎం. రమేష్, తరుణ్ జోషి, స్టీఫెన్ రవీంద్ర, సిఐడి ఎస్‌పి అపూర్వ రావు, ఎఐజి నాగరాజు ఈ వేడుకలలో పాల్గొన్నారు. డిజిపి కార్యాలయ తెలంగాణ నాన్- గెజిటెడ్ అధికారుల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా డిజిపి రవి గుప్తా పోలీసుశాఖలో బాధ్యతలు ఒత్తిడితో కూడుకున్నవని, మినిస్టీరియల్ సిబ్బంది శాఖకు వెన్నముకలాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. శాంతి భద్రతలను మెరుగుపరచడానికి జట్టుగా, కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది వేగంగా స్పందిస్తే ప్రజలకు ఎంతో లాభం చేకూరుతుందని ఆయన చెప్పారు. సిబ్బంది ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. పోలీసు సిబ్బంది కలిసి పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. డిజిపి కార్యాలయ తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి టి. శివరంజని ప్రారంభోపన్యాసం చేయగా సంఘం అధ్యక్షుడు సి.పవన్ కుమార్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి, సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, శంకర్ రెడ్డి, దుర్గా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News