తుర్కయంజాల్: ప్రముఖ వస్త్ర వ్యాపారంలో తెలుగు రాష్ట్రాలలో పేరిన్నిగల చందన బ్రదర్ షాపింగ్ మాల్‌ను శుక్రవారం సాగర్ రహదారి తుర్కయంజాల్ పట్టణంలో ప్రారంభించారు. ఈ షాపింగ్ మాల్‌ను రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ప్రముఖ సినీనటి అను ఇమాన్యుయల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. నగర శివారు ప్రాంతమైన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్‌లో
ప్రారంభించడం ఆనందంగా ఉందని సంస్థ అధినేత అల్లక సత్యనారాయణను ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అభినందించారు. దీంతో పాటు తమ నియోజకవర్గంలో మరిన్ని శాఖలను విస్తరించాలని సంస్థ అధినేతను కొరారు. మొత్తం షాపింగ్ 5 ఫ్లోర్‌లతో విశాలమైన భవంతులతో వందల సంఖ్యలో ఉపాధి కల్పిస్తూ మార్కెట్ ధరల కంటే తగ్గింపు ధరలతో వినియోగదారులకు అందిస్తున్నామని సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ తెలిపారు. ప్రారంభానికి సహకరించిన కస్టమర్లకు, పోలీసు శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.