Monday, January 20, 2025

జూన్ 12న పాట్నాలో భారీ ప్రతిపక్ష సమావేశం!

- Advertisement -
- Advertisement -
దాదాపు 24 రాజకీయ పార్టీలు హాజరయ్యే అవకాశం

పాట్నా: భారతీయ జనతా పార్టీ(బిజెపి)ని వ్యతిరేకస్తున్న రాజకీయ పార్టీలన్నింటితో భారీ ప్రతిపక్ష సమావేశాన్ని పాట్నాలో జూన్ 12న ఏర్పాటు చేయాలని జనతాదళ్(యు) యోచిస్తున్నది. ఈ సమావేశంలో దాదాపు 24 రాజకీయ పార్టీలు పాల్గొనవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 18 పార్టీలతో చర్చలు జరిపారు. మిగతా పార్టీలను కూడా కొద్ది రోజుల్లో సంప్రదించనున్నారని సమాచారం. జెడి(యు) పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడు ఈ వివరాలు తెలిపారు.

నితీశ్ కుమార్ జరిపిన అనేక రౌండ్ల చర్చల్లో నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది అందులో ప్రధాన ప్రశ్న. కాగా సీట్ షేరింగ్ ఫార్ములా విషయంలో జెడి(యు) అంతగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతానికైతే సీట్ షేరింగ్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల ఐక్యతలో ప్రధాని అభ్యర్థి ఎవరనేది రెండో చర్య అని జెడి(యు) నాయకుడు తెలిపారు.
ప్రతిపక్షాల భారీ సమావేశంలో ఓ పురోగతి కనిపించనుందని నమ్ముతున్నారు. ప్రతిపక్షాల కూటమికి ప్రతినిధులను అధికారికంగా నియమించడం జరగొచ్చని తెలుస్తోంది. ఉమ్మడి కనీస కార్యక్రమంలో భాగంగా అన్ని పార్టీలు ఆమోదించిన అంశాలపై చర్చలు జరపొచ్చు. ‘బిజెపి వ్యతిరేక పార్టీలతో చర్చలు ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరు ఉన్నత నాయకులను సంధాన కర్తలుగా ఏర్పాటు చేయవచ్చు’ అని జెడి(యు) నాయకుడొకరు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News