Thursday, January 23, 2025

గ్రాండ్ గా ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు అభిమానుల సమక్షంలో హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. కూకట్ పల్లి కైత్లాపూర్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకే ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ప్రభాస్ భారీ కటౌట్ ను అభిమానులు కైత్లాపూర్ గ్రౌండ్స్ లో ఆవిష్కరించారు. ప్రభాస్ కటౌట్ కు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు శాస్త్రి, రామకృష్ణ, గోవింద్ తదితరుల సమక్షంలో ఈ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు శాస్త్రి మాట్లాడుతూ – మన హీరో ప్రభాస్ గారి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులను చూస్తుంటే హ్యాపీగా ఉంది. మన హీరో ప్రభాస్ గారు సినిమాల్లోనే కాదు బయట కూడా హీరోనే. ఆయన ఎంత మంచి వారో మనందరికీ తెలుసు. ప్రభాస్ గారి సలార్ డిసెంబర్ 22న వస్తోంది. ఆ సినిమా మామూలుగా ఉండదు. ఆ రోజు ఇంకా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకుందాం. అన్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ – ప్రభాస్ గారికి వాళ్ల నాన్న సూర్య నారాయణరాజు గారు, పెద నాన్న కృష్ణం రాజు గారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. వాళ్లు ఎక్కడున్న ఈ సెలబ్రేషన్స్ చూస్తుంటారు. ప్రభాస్ గారు తనకు తానుగా స్టార్ గా ఎదిగిన హీరో. ఆయన సలార్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయాలి. అన్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు గోవింద్ మాట్లాడుతూ – ప్రభాస్ గారి స్టార్ డమ్ కు ఇండస్ట్రీలో సాటి లేదు. ఆయన మన అభిమానులను ఎంతగా ప్రేమిస్తారో అందరికీ తెలుసు. ప్రభాస్ గారికి రాబోయే సినిమాలన్నీ సూపర్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుందాం. అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News