Saturday, April 12, 2025

ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ‘కూలీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో కిం గ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కన్న డ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ సౌబిన్ షాహిర్, స్టార్ హీరోయిన్ శృతి హాసన్, సత్యరాజ్ ఇతర ప్రధాన పాత్ర ల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. కూలీ సినిమాని 2025 ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా వదిలారు. ఇందులో తలైవర్ విజిల్ వేస్తూ కనిపిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News