Wednesday, January 22, 2025

టిడిపి కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : క్రిస్మస్ సందర్భంగా టిడిపి కార్యాలయం ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం సెమి క్రిస్మస్ వేడుకను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి పలువురు నేతలు రాష్ట్ర ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. రెవరెండ్ పాస్టర్ మనోహర్ పవిత్రమైన బైబిల్ వాఖ్యలను చదివి వినిపించి ప్రార్థనలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దేవుని దీవెనలు ఉండాలన్నారు.

టిడిపి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తూ సర్వ మానవ సౌభ్రాతృత్వం కోసం కృషి చేసే లౌకిక వాద పార్టీ అని అన్నారు. క్రీస్తు పుట్టిన రోజు వేడుకలకు సమయాత్తం అవుతూ ఈ సెమి క్రిస్మస్‌ను జరుపుకోవడం జరుగుతున్నదని అన్నారు. ప్రేమ అంటేనే జీసెస్ అని, పొరుగు వారిని ప్రేమించడమే క్రైస్తవ మత సిద్ధాంతమని అన్నారు. మతం కన్న కూడా మానవ జీవన విధానం గురించి క్రైస్తవం తెలుపుతుందన్నారు. పొరుగు వారిని ఆదుకోవడం, సంఘ సేవ వంటి వాటిని ఏసు క్రీస్తు బోధించారని అన్నారు. బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్ , రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వేజండ్ల కిషోర్ రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంద్యపోగు రాజశేఖర్, రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాషిణి కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News