Monday, December 23, 2024

సినిమా చూసి… నానమ్మను ముక్కలు ముక్కలుగా నరికి

- Advertisement -
- Advertisement -

ముంబయి: సినిమాలో చూసి నానమ్మ ఆస్తి కోసం ఆమెను అతి కిరాతకంగా తన తండ్రితో కలిసి మనవడు చంపిన సంఘటన మహారాష్ట్రలోని కేశవ్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉషా విఠల్ గైక్వాడ్(64) అనే వృద్ధురాలు తన కుమారుడు సందీప్ గైక్వాడ్(45) కుటుంబంతో కలిసి ఉంటుంది. ఆస్తుల విషయంలో సందీప్ కుమారుడు సాహిల్ గైక్వాడ్ తన నానమ్మతో గొడవకు దిగేవాడు. అత్త కొడలు మధ్య గొడవ జరగడంతో ఆమె ఇంటి నుంచి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఉషా విఠల్ ఇంట్లో నిద్రపోతుండగా మనవడు ఆమెను బాత్రూమ్‌లోకి లాక్కెళ్లి చంపేశాడు. మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లడానికి కష్టమవుతుందని భావించాడు. వెంటనే తన తండ్రి సహాయంతో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బస్తాలో కుక్కి ముథా నదిలో పడేశారు. తన తల్లి కనిపించడంలేని స్థానిక పోలీస్ స్టేషన్‌లో సందీప్ ఫిర్యాదు చేశాడు. ఉషా విఠల్ కూతురుకు తన అన్నపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజాలు బయటకొచ్చాయి. సాహిల్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మలయాళ సినిమాలోని కథ ఆథారంగా మర్డర్ చేశానని పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. త్రండీ కొడుకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News