Monday, January 20, 2025

ఘనంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

నల్గొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక మదీనా మసీదులో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గం సంబంధించి 164 మంది ఇమామ్లు మరియు మౌజుమ్ లకు నెలకు 5000 రూపాయల చొప్పున పారితోషికం అందిస్తున్నదని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంతో ఉన్నారని అన్నారు.

మైనారిటీల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు, విదేశీ విద్య కొరకు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, హజ్ యాత్రికులకు సహాయం మైనారిటీ లకు లోన్ లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్నారని నల్లగొండకు సంబంధించి ఓల్ సిటీలో ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తున్నామని తొలుత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఈద్గా వరకు 34 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం జరుగుతుందని1500 కెపాసిటీ గల షాదీ ఖానాకు డిబిఆర్ సిద్ధం చేయమని మున్సిపల్ కమిషనర్ కు తెలిపామని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.. రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి.. ఫారిదోద్దీన్, జాఫర్,జమాల్ ఖాద్రి, ఆయుబ్, పట్టణ పార్టీ కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు.. మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News