Monday, December 23, 2024

ఘనంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం రాజీవ్ గాంధీనగర్ బుద్ధ విహార్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా బౌద్ధ మతస్తులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

సిఎం కసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు మరియు విష్వరత్న బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News