Friday, November 22, 2024

కెటిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా క్రీడా వేడుకలు :ఆంజనేయ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ నగర ఖ్యాతి మరింత ఇనుమడింపు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న యూత్ ఐకాన్ , ఐటి శాఖ మంత్రి కెటిఆర్ బర్త్‌డే సందర్భంగా క్రీడా వేడుకలను ఘనంగా నిర్వహించడానికి క్రీడా సంఘాలు ముందుకు రావడం హర్షనీయమని స్పోర్ట్ అథారిటి ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. ఈ నెల 24వ తేదిన మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటి.రామారావు జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా సంఘాలు స్పోర్ట్ అథారిటి సమన్వయంతో ‘తెలంగాణ క్రీడా వేడుక’ను ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వివిధ వర్గాలలో క్రీడల పట్ల ఆసక్తి కల్పించి, రాష్ట్రంలో మంచి క్రీడా వాతావరణం తీసుకురావడానికి స్పోర్ట్ అథారిటి చేస్తున్న ప్రయత్నాలకు క్రీడా సంఘాలు సహకరిస్తూ వివిధ ప్రతిపాదనలతో ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని ఆంజనేయ గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ సైక్లింగ్, రోలర్ స్కేటింగ్, రెజ్లింగ్ అసోసియేషన్‌ల రాష్ట్ర ప్రతినిధులు ఎల్‌బి స్టేడియంలోని శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ కార్యాలయంలో సమావేశమైనారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ జన్మ దినోత్సవం సందర్భంగా క్రీడా వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని, ఇందుకు శాట్స్ కూడా సహకరించాలని ఛైర్మన్ ఆంజనేయ గౌడ్‌కు విన్నపం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ క్రీడా ప్రేమికుడైన ‘యూత్ ఐకాన్’ మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా క్రీడా వేడుకల్ని నిర్వహించాలన్న ప్రతిపాదన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని, సంఘాల ఆధ్వర్యంలో జరిగే క్రీడల్ని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఎల్లవేళలా అండగా ఉంటుందని , ఈ క్రీడా వేడుకలను నిర్వహించడానికి తమ వంతు సహకారం అందజేస్తామని తెలిపారు. క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సహకారంతో సైక్లింగ్, రోలర్ స్కేటింగ్, రెజ్లింగ్ (మహిళలు) పోటీలు నిర్వహించడానికి స్పోర్ట్ అథారిటి తరపున ఆయా క్రీడా సంఘాలకు సంపూర్ణంగా సహకరిస్తామని ఆంజనేయ గౌడ్ తెలిపారు. వారి సూచనల మేరకు ఈ క్రీడలను దిగ్విజయం చేయడానికి శాట్స్ సంపూర్ణంగా సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్. మల్లారెడ్డి, దత్తాత్రేయ, తెలంగాణ ఆమెచ్యుర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అమ్‌జాబీన్ ఓమర్ (జాఫర్‌భాయి), కె. నర్సింగ్‌రావ్, రోలర్ స్కేటింగ్, అసోసియేషన్ ప్రతినిధులు, కుషాల్‌రాయ్ మహేందర్, ధర్మెందర్‌సింగ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News