Thursday, December 26, 2024

బాగ్‌లింగంపల్లి లంబాడతండాలో ఘనంగా గిరిజనోత్సవాలు

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: భారత రాష్ట్ర సమితి రాంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలో గిరిజనోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. స్థానిక లంబాడతండాలో లంబాడ మహిళల మధ్య ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్‌ఎస్ నాయకులు గిరిజన ఉత్సవాలను జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న మా తండాలో మా రాజ్యం నినాదాన్ని సాధించుకున్నామని, గిరిజనులకు ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలతో లబ్దిపొందుతున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ క్షీరాభిషేకం చేశారు. అనంతరం సాంప్రదాయ దుస్తులు ధరించిన లంబాడ మహిళలు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి నృత్యం చేశారు. బిఆర్‌ఎస్ రాష్ట్ర యవకులు ముఠా జైసింహ, బిఆర్‌ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్షులు రావులపాటి మోజస్, ప్రధాన కార్యదర్శి మన్నె దామోదర్ రెడ్డి, కళ్యాణ్ నాయక్, శ్రీకాంత్ గౌడ్, సందీప్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News