Monday, December 23, 2024

హైదరాబాద్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి టిడిపి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి విమానంలో చంద్రబాబు బేగంపేటకు చేరుకున్నారు. బేగంపేట నుంచి ఆయన జూబ్లీహిల్స్ లోని నివాసానికి వెళ్లనున్నారు. రేపు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో బాబుకు కంటి పరీక్షలు చేయనున్నారు. 50 రోజులు జైలు జీవితం గడిపిన చంద్రబాబు నాయుడు, వైద్య కారణాలతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై నిన్న బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News