Monday, December 23, 2024

లండ‌న్‏లో మంత్రి కెటిఆర్‏కు ఘ‌న‌స్వాగ‌తం

- Advertisement -
- Advertisement -

Grand Welcome To Minister KTR In London

లండన్: యునైటెడ్ కింగ్‌డమ్‌, దావోస్ పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న మంత్రి కెటిఆర్ కు ఘనస్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయంలో యుకెకి చెందిన టీఆర్ఎస్ పార్టీ విభాగంతో పాటు అనేక ఎన్ఆర్ఐ సంఘాలు, ఇతర ప్రముఖులు మంత్రి కెటిఆర్ కి స్వాగతం పలికారు. యుకెలో 4 రోజులపాటు పర్యటనకు వెళ్లిన కెటిఆర్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాదిమందితో లండన్ విమానాశ్రయంలో కోలాహలం నెలకొంది. అనేక మంది తమ కుటుంబ సభ్యులతో విమానాశ్రయానికి చేరుకుని కేటీఆర్ కి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రి కెటిఆర్ తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. కాగా, కెటిఆర్ అనేక రంగాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మంత్రి కెటిఆర్ కి లండన్ లో స్వాగతం పలికి సాదరంగా స్వాగతించారు. పెట్టుబడుల కోసం లండన్ వెళ్లిన తెలంగాణ ఐటి,పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్ కి స్వాగతం పలుకుతూ లండన్ తెలంగాణ ఎన్నారై లు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి.

 Grand Welcome To Minister KTR In London

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News