ఎపిలోని విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఊయలలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిపై వరుసకు తాత అయిన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నారిని ఊయలలో వేసిన తల్లి కిరాణషాపుకు వెళ్లడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నార్లవలసకు చెందిన బోయిన ఎరకన్న దొర పసిపాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంతో అక్కడికి చేరుకున్న ఆమె అక్క తల్లికి విషయం చెప్పింది.
విషయం గ్రామస్థులకు తెలియడంతో అందరూ కలిసి వృద్ధుడిని వెంబడించారు. అయినప్ప టికీ వారికి చిక్కకుండా తప్పించుకున్నాడు. మరోవైపు, తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా కేంద్రం విజయనగరంలోని ఘోష ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం పాప కోలుకు న్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నార్లవలసలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.