Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో తాత మనుమరాలు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నర్సంపేట: మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత, మనుమరాలు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఇటుకాలపల్లిలో తాత నానమ్మలతో కలిసి వారి మనుమరాలు టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై వెళ్తుండగా జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ అటుగా వస్తున్న ఎక్స్ ఎల్ వాహనాన్ని ఢీకొట్టింది.

దీంతో ధరావత్ పూర్ణిత అక్కడికక్కడే మృతిచెందింది. వృద్ధ దంపతులు ధరావత్ పాత్యా, నాగమ్మలకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పాత్యా మృతిచెందాడు. నర్సంపేట ఎస్సై రవీందర్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News