Monday, December 23, 2024

టిడిపితో పవన్ సహజీవనం: వైసిపి ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కావాల్సింది పెత్తందార్లు మాత్రమేనని వైసిపి ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. బీమవరం ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పేదల కష్టాలు వారికి అవసరం లేదని, వారాహి యాత్రలో రెండు చెప్పులు పోయాయని పవన్ అంటున్నారని మండిపడ్డారు.

Also Read: స్నేహితుడిని చంపి… రోడ్డు ప్రమాదంలో తానే మృతి చెందినట్టుగా చిత్రీకరించి…

చంద్రబాబు ఇంటికి వీధి గుమ్మం గుండా వెళ్లి పవన్ ప్యాకేజీ తీసుకుని దొడ్డి దారిన వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే రెండు చెప్పులు వదిలేశారని, చంద్రబాబు ఇంటికి వెళ్లి వెతికితే రెండు చెప్పులు దొరుకుతాయన్నారు. పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారని, టిడిపితో పవన్ సహజీవనం చేస్తున్నారని శ్రీనివాస్ దుయ్యబట్టారు. చిరంజీవి ఎవరిని మోసం చేయలేదని, పవన్ అడుగడుగునా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అభిమానిగా పవన్‌ని కోరేది ఒక్కటేనని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News