Wednesday, January 22, 2025

రూ. కోటి బీమా కోసం అమ్మమ్మకు పాముతో కాటు వేయించి….

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: బీమా డబ్బుల కోసం అమ్మమ్మకు పాముతో కాటు వేయించి చంపిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాందే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకాశ్ అనే వ్యక్తికి రాణి పఠారియా అనే అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ పేరిట రూ. కోటి బీమా పాలసీ చేశాడు. అమ్మమ్మను చంపేస్తే కోటీ రూపాయలు పాలసీ వస్తుందని ఆశ పెంచుకున్నాడు. 30 వేల రూపాయలతో సుపారీ ఇచ్చి వృద్ధురాలికి పాముతో కాటు వేయించడంతో ఆమె చనిపోయింది. పాము కాటుతో తన అమ్మమ్మ చనిపోయిందని అందరినీ నమ్మించాడు. బీమా పాలసీ దరఖాస్తు చేసుకొని కోటి రూపాయలు నగదును తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆకాశ్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. దీంతో ఆకాశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మనవడి వద్ద నుంచి పది లక్షల రూపాయలతో పాటు నగదు, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News