Thursday, January 23, 2025

ఢిల్లీ ఓపెన్ చెస్ విజేత అర్జున్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ అంతర్జాతీయ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన అర్జున్ ఎరిగైసి టైటిల్‌ను సాధించాడు. తెలుగుతేజం అర్జున్ 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు ట్రోఫీతో పాటు నాలుగు లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. అర్జున్ ఇటీవలే జాతీయ చెస్ టైటిల్‌ను సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన పదో రౌండ్‌లో అర్జున్ జయకేతనం ఎగుర వేశాడు. కార్తీక్ వెంకటరామన్‌తో జరిగిన పోరులో అర్జున్ విజయం సాధించాడు. ఇక మరో యువ సంచలనం గుకేశ్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. హర్షా భారత్‌కోటి సెకండ్ రన్నరప్ ట్రోఫీని సాధించాడు. రాజధాని ఢిల్లీ వేదికగా ఈ పోటీలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News