Wednesday, January 22, 2025

గుకేశ్ అరుదైన రికార్డు..

- Advertisement -
- Advertisement -

చెన్నై: భారత యువ గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్ చరిత్ర సృష్టించాడు. తాజాగా ఫిడే ప్రకటించిన చెస్ ర్యాంకింగ్స్‌లో గుకేశ్ 8వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో గుకేశ్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 37 ఏళ్లుగా భారత్ తరఫున టాప్ ర్యాంకర్‌గా కొనసాగుతున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను గుకేశ్ వెనక్కి నెట్టి ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకెళ్లాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో గుకేశ్ 2,758 పాయింట్లతో 8వ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. ఆనంద్ 2,754 పాయింట్లతో 9వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కాగా, ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన ఆనంద్ 1986 నుంచి చెస్ ర్యాంకింగ్స్‌లో భారత నంబర్‌వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తాజాగా ఈ రికార్డును గుకేశ్ దక్కించుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News