Friday, December 20, 2024

నానమ్మ,అత్త వేధింపులకు యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామానికి చెందిన నాగపురి రాజ్ కుమార్ (20) అనే యువకుడు రైలు కింద పడి మృతి చెందాడు. రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాల మేరకు రాజ్ కుమార్ నానమ్మ వీరమ్మ, అత్త బుర్ర స్రవంతి తనను భూమి విషయంలో మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నారని దాంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు, తన చావుకి వారే కారణమని వాట్సాప్ లో ఉన్న మెసేజ్ ద్వారా గుర్తించినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి పెద్దపల్లి- మంథని ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుని తల్లి మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News