Saturday, January 18, 2025

ఆరేళ్ళ మనుమరాలిని అమ్మకానికి పెట్టిన అమ్మమ్మ

- Advertisement -
- Advertisement -

సొంత కూతురు కుమార్తె (మనుమరాలిని) అమ్మమ్మ అమ్మకానికి పెట్టిన హృదయ విదారకర సంఘటన వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండల పరిధి ఘనపూర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.. అంగన్వాడీ సూపర్వైజర్ రిజ్వానా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జానీ యాదమ్మ, రాములుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ వివాహాలు జరుగగా, వీరిలో ఒక కుమార్తె సౌందర్య హైదరాబాద్‌లో ఒక యువకుడిని ప్రేమ వివాహం చేసుకుని అక్కడే ఉంటోంది. యాదమ్మ కూడా ఆ కుమార్తె వద్దే ఉంటూ అప్పుడప్పుడు సొంత గ్రామానికి వస్తుండేది. సౌందర్య ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత ఆమె మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో మనుమరాలిని అమ్మమ్మ తన స్వగ్రామానికి తీసుకొచ్చి ఇక్కడే తనతోపాటు పెంచి, పోషిస్తోంది.

ప్రస్తుతం ఆ బాలికకు ఆరేళ్లకు పైగా ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం పాపను నీట్‌గా తయారుచేసి, ఇంట్లోని సామానుతోపాటు అమ్మమ్మ ఆటోలో ఎక్కుబోయింది. దీంతో చిన్నారిని అమ్మకానికి తీసుకువెళ్తోందని అనుమానం వచ్చిన కొందరు స్థానికులు 100 డయల్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు గ్రామానికి వెళ్లి పాపను అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆక్కడి నుంచి ఆ బాలికను వికారాబాద్‌లోని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. కాగా, యాదమ్మ కుమారునికి కూడా మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో మూడు నాలుగు నెలల క్రితం మృతి చెందాడని తెలిసింది. అయితే గ్రామస్థులు ఎవరూ వెళ్లకపోవడంతో పంచాయతీకి చెందిన ట్రాక్టర్లో తీసుకెళ్లి అంత్యక్రియలు చేసినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News