Wednesday, January 22, 2025

కార్మికుడి మలద్వారంలో పైప్ పెట్టి గాలి ఎక్కించిన దుర్మార్గులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని ఆరెంపుల గ్రామ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కార్మికుడికి కిరాతకంగా మలద్వారంలో పైప్ పెట్టి గాలి ఎక్కించారు కొందరు దుర్మార్గులు. ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొడవ కాస్త ముదరడంతో కోపోద్రిక్తులైన కొంతమంది కార్మికులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడి మలద్వారంలో గ్రానైట్ పాలిషింగ్ ఎయిర్ పైపు పెట్టి గాలి ఎక్కించారు. బాధితుడి కడుపు ఉబ్బడంతో ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News