- Advertisement -
మనతెలంగాణ/మాదాపూర్: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులకు తగిన నిధులు మంజూరు చేయాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ చందానగర్ సర్కిల్ 21 ఈఈ శ్రీకాంతిని కొరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు పనులకు గాను తగిన నిధులు మంజూరు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఆధికారులను ఆదేశించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి కాలనీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలన్నారు. డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు లేక కాలనీల ప్రజలు ఇబ్బందులకు గురైతున్నరన్నారు. అందుకు పెండింగ్‌తో పాటు నూతన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలన్నారు.
- Advertisement -