- Advertisement -
నిజామాబాద్ సిటీ: నగరంలోని వివిధ కుల సంఘాల భవన నిర్మాణాల కొరకు గురువారం 30 లక్షలు ఎమ్మెల్యే కోటా సిడిపి నిధులు మంజూరు చేసి ప్రోసీడింగ్ కాపీలను క్యాంప్ కార్యాలయంలో సంఘ సభ్యులకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచముఖి హనుమాన్ ఆలయం షెడ్, వినాయక్‌నగర్‌కు 10 లక్షలు, మేధరి సంఘం కమ్యూనిటి హల్, గాజుల్‌పేట్‌కు 10లక్షలు, బైతుల్ మాల్ కమ్యూనిటీ హాల్, ఆటోనగర్‌కు 10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -