Wednesday, January 29, 2025

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు

- Advertisement -
- Advertisement -

మల్హర్: మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన 5 మండలాల అభివృద్ధి కోసం రూ. 268.50 లక్షల సిడిపి నిధులను మంజూరైనట్లు ఎంఎల్‌ఎ కార్యాలయం నుండి సోమవారం ప్రకటన విడుదల చేశారు. స్థానిక ఎంఎల్‌ఎ శ్రీధర్‌బాబు ప్రపోజ్ చేసిన మల్హర్, మహాదేవ్‌పూర్, మహాముత్తారం, కాటారం, పలిమెల మండలాల్లోని 68 పనులకు ఈనిధులను ఖర్చుచేసేవిదంగా జిల్లా కలెక్టర్ ప్రోసీడింగు జారీ చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

మల్హర్ మండలంలోని కొండంపేట, అన్‌పాన్‌పల్లి, మల్లారం, నాగులమ్మ వద్ద బస్‌షెల్‌టర్ల నిర్మాణంకోసం మూడు లక్షల చొప్పున రూ.12 లక్షలు, రుద్రారంలో బుడిగజంగం కమ్యూనిటీ హాల్‌కోసం రూ.5 లక్షలు, నాచారంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.5 లక్షలు, కొయ్యూరు బస్‌షెల్టర్ టాయిలెట్ల కోసం రూ. లక్ష, మల్లారంలో సిసి రోడ్డుకు రూ.3.50 లక్షలు, పెద్దతూండ్లలో సైడ్‌డ్రైన్‌కు రూ. 3 లక్షలు, పెద్దతూండ్లలో సిసి రోడ్డుకు రూ.2లక్షలు, అన్సాన్‌పల్లిలో రెండు సిసి రోడ్లకు రూ. 9లక్షలు కేటాయించారు. నిధుల మంజూరుపై కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News