Monday, December 23, 2024

కోర్టు భవనం మరమ్మతుకు నిధులు మంజూరు

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలోని కోర్టు భవనాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ బుధవారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న కోర్టు భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యేకు అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి బార్ అసొసియేషన్ సభ్యులు, న్యాయవాదులు వివరించారు. దానికి స్పందించిన ఎమ్మెల్యే తక్షణ సహాయంగా 12 లక్షలు మంజూరు చేశారు. అదే విధంగా నూతన కోర్టు భవనం నిర్మాణం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసొసియేషన్ సభ్యులు భాస్కర్ రెడ్డి, నాగరాజు, చిందం కృష్ణయ్య, వెంకట్ రెడ్డి, అమరేందర్, వెంకటేష్, వెంకటరమణ, మల్లేష్, రాంగోపాల్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News