మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్,ఇతరులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లింపునకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిఒ నెంబర్ 30 ద్వారా 61 కోట్ల 77లక్షల రూపాయలు మంజూరు చేశారు. దీని ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఇతరులకు జనవరి నుంచి పెండింగ్ వేతనాలు చెల్లించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్ జి.రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, డాక్టర్ వి.శ్రీనివాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు, ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావుకు, ఇందుకు సహకరించిన ఆర్థిక శాఖ, విద్యా శాఖ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్తర్వులు సంబంధించి సంబంధిత వేతనాల ప్రొసీడింగ్స్‌ను వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్ విద్య కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
కాంట్రాక్ట్ లెక్చరర్స్ పెండింగ్ వేతనాలు మంజూరు
- Advertisement -
- Advertisement -
- Advertisement -