Friday, December 20, 2024

38 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు రెగ్యులర్ పోస్టుల మంజూరు

- Advertisement -
- Advertisement -

Grant of regular posts to 38 fasttrack courts

మనతెలంగాణ/హైదరాబాద్ : సత్వర మే ప్రజలకు న్యాయం జరుగాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 38 ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రజలకు స త్వరమే న్యాయం జరగాలన్న ఉద్దేశంతో నే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను కోరింది. రెగ్యులరైజ్ చేసిన కోర్టుల్లో 22 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి క్యాడర్, 16 సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్‌కు చెందినవి ఉన్నట్లు సర్కారు ఉత్తర్వులలో పేర్కొంది. అంతేకాకుండా ఆయా కోర్టుల కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి 1,098 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మరో జివొ విడుదల చేసింది. అదేవిధంగా 22 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి క్యాడర్ కోర్టులకు సంబంధించి 682 పోస్టులు, 16 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు 416 పోస్టులు మంజూరు చేసింది. దీంతో పాటు మరో 14 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టుల్లో 308 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News