Monday, December 23, 2024

పోడు భూములకు పట్టాల మంజూరు

- Advertisement -
- Advertisement -

ములకలపల్లి : అశ్వారావుపేట నియోజకవర్గంలోని మండలాలకు చెందిన గిరిజన రైతులు గత అనేక సంవత్సరాలుగా పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించాలని కోరుతుండగా ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు కృషి ఫలితంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయంతో నియోజకవర్గంలో 10 వేల మందికి పైగా పోడు రైతులకు నేడు పట్టాలు మంజూరైయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరుపున పోడు భూములకు పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆదేశాలతో శుక్రవారం అన్ని జిల్లాలలో స్థానిక శాసన సభ్యుల సమక్షంలో మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు.

పాల్వంచ సుగుణా ఫంక్షన్ హలులో జిల్లాలోని పోడు సాగుదారులకు పట్టాలు పంపిణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ పర్యేక్షణలో స్థానిక శాసన సభ్యులు సమక్షంలో రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కృషి ఫలితంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలలోని 10 వేల మందికి పైగా రైతులకు పట్టాలు మంజూరు చేశారు. శుక్రవారం మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్, పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఇతర ఎంఎల్‌ఎల సమక్షంలో లాంఛనంగా ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి నియోజకవర్గంలోని మొదటి రోజు దాదాపు 1000 మంది పోడు రైతులకు పట్టాలను అందజేశారు.

పట్టాలు మంజూరైన మిగిలిన రైతులకు పట్టాలను రెండు రోజుల్లో ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావును చరవాణిలో సంప్రదించగా తన నియోజకవర్గంలో 10 వేల మంది పైగా పోడు రైతులకు పట్టాలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, మంత్రులు కెటిఆర్‌కు, హరీశ్‌రావుకు, పువ్వాడ అజయ్ కుమార్‌కు, సహకరించిన పార్లమెంటు సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. లాంఛనంగా ఈ రోజు మంత్రుల చేతుల మీదుగా కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో ప్రారంభించామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో నియోజకవర్గంలో పట్టాలు మంజూరైన ఇతర రైతులకు కూడా ఇస్తామన్నారు. పట్టాలు రాని పోడు రైతులు ఆధైర్య పడొద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తాను సమస్యను తీసుకెళ్లి వారికి కూడా పట్టాలు ఇప్పిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News