Wednesday, January 22, 2025

సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

శివసేన(యుబిటి) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో సంజయ్ రౌత్‌కు దిగువ కోర్టు విధించిన కాగార శిక్షను శుక్రవారం నిలిపివేసిన సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దిగువ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సంజయ్ రౌత్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను న్యాయమూర్తి సంజీవ్ పింగ్తే విచారణకు స్వీకరించారు. శుక్రవారం కోర్టులో వ్యక్తిగతంగా హాజరైన రౌత్ తనకు బెయిల్ మంజూరు చేయాలని అర్థించారు.

రూ. 50,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఈ కేసుపై తుది వాదనలు వచ్చే ఏడాది జనవరి 31న జరుగుతాయని తెలిపింది. కాగా..కిరీట్ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసుపై సెప్టెంబర్ 26న తీర్పు ఇచ్చిన జుడిషియల్ మెజిస్ట్రేట్(ఫస్ట్ క్లాస్) ఆర్తీ కులకర్ణి సంజయ్ రౌత్‌ను దోషిగా నిర్ధారించి 15 రోజుల జైలు శిక్షతోపాటు రూ. 25,000 జరిమానాను విధించారు. అయితే అప్పీలు చేసుకునేందుకు వీలుగా జైలు శిక్షను 30 రోజులపాటు న్యాయమూర్తి నిలిపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News